కేన్స్: 62వ "కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్" అట్టహాసంగా ఈ రోజు(బువారం) ప్రాంరంభం అయింది. వివిధ దేశాలకు చెందిన సినీ ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొంటున్నారు. భారతదేశం నుండి ఐశ్వర్యరాయ్ తన భర్త అభిషేక్ తో కలసి అటెండయ్యారు. 12 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవానికి రంగు రంగుల బెలున్స్‌తో చిన్నారులు ప్రతినిధులకు ఆహ్వానం పలికారు. ప్రాంరంభ చిత్రంగా యానిమేషన్ చిత్రం "అప్"ను ప్రదర్శించారు. ఈ సంవత్సరం సోనమ్ కపూర్ ఈ ఉత్సవానికి ప్రత్యేక ఆహ్వానితురాలు. తమ స్నేహితుల ఆహ్వానంపై ఈ పెస్టివల్ లో పాల్గొంటున్నట్లు అభిషేక్ తెలిపారు.