పాశ్వాన్, బంగారప్ప ఓటమి
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో చక్రం తిప్పుతామని ప్రగ్భలాలు పలికిన లోక్ జనశక్తి పార్టీ అధినేత, కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ ఓటమి పాలయ్యారు. ఆయన నేతృత్వంలోని పార్టీకి ఒక్క సీటూ దక్కలేదు. ఇక కర్నాటక లోని షిమోగా స్థానం నుంచి వరుసగా ఐదుసార్లు గెలిచిన బంగారప్ప ఆరోసారి కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడిపోయారు. ఆయన కప్పదాటు వ్యవహారాలతో పాటు ఇక్కడ బిజె పి బాగా బలపడడంతో ఆయన ఓటమి పాలైనట్లు తెలుస్తోంది.
బీహార్‌తో పాటు జార్ఖండ్, ఉత్తరప్రదేశ్‌లలోనూ పోటీ చేసిన పాశ్వాన్ పార్టీ అభ్యర్థులు చాలాచోట్ల డిపాజిట్లు కోల్పో యారు. బీహార్‌లో తన చిరకాల ప్రత్యర్థి లాలూతో జతకలిసి ఎన్నికల బరిలో నిలిచినా ఆ ప్రభావం ఏ మాత్రం కనపడకపోవడం విశేషం. ఆర్జేడీ అధినేత లాలూకి నాలుగైదు సీట్లు మించి వచ్చే అవకాశం కనపడడం లేదు. బీహార్‌లో పాశ్వాన్ హవా సాగుతోంది.












Click it and Unblock the Notifications