చిత్తూరు: చిత్తూరు జిల్లా కుప్పం శాసనసభా నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు విజయం సాధించారు. ఆయన తన సమీప ప్రత్యర్థి సుబ్రహ్యణ్యంరెడ్డిపై 46 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలిచారు. చంద్రబాబును దెబ్బ తీయడానికి ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు.
చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గాలి ముద్దు కృష్ణమనాయుడు భారీ మెజారిటీతో విజయం సాధించారు. చంద్రగిరిలో రోజా పరాజయం పాలయ్యారు. మంత్రి గల్లా అరుణకుమారి రోజాపై విజయం సాధించారు.