చెన్నై: కేంద్ర హోం మంత్రి పి.చిదంబరం శివగంగ లోకసభ స్థానం నుంచి ఓటమి పాలయ్యారు. అన్నాడియంకె నేత రాజా కన్నప్పన్ చేతిలో ఆయన ఓడిపోయారు. తమిళనాడులో కాంగ్రెస్-డిఎంకె కూటమి ఆధిక్యంలో కొనసాగుతున్నప్పటికీ చిదంబరం ఓడిపోవడం విచిత్రం.
ముఖ్యమంత్రి కరుణానిధి కుమారుడు అజగిరి విజయం సాధించారు. డిఎంకె పార్టీ కార్యాలయం వద్ద సందడి చోటు చేసుకుంది. డిఎంకె కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. అన్నాడియంకె కార్యాలయం బోసిపోయి కనిపిస్తోంది.