కుప్పకూలిన హెలికాప్టర్: ఇంటెలిజెన్స్ చీఫ్ సహా ఏడుగురు దుర్మరణం!

కెన్యాలోని సంబురు కౌంటీలో బుధవారం ఉదయం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. లోయిసాబా వైల్డ్‌లైఫ్ రిజర్వ్ నుంచి బయలుదేరిన ఓ పర్యాటక హెలికాప్టర్ ఉదయం 9.13 గంటల ప్రాంంలో ఎవాసో నైరో ప్రాంతానికి వెళ్తుండగా సాంకేతిక లోపం లేదా ప్రతికూల పరిస్థితుల వల్ల ప్రమాదానికి గురైంది. ప్రమాదం తీవ్రత వల్ల హెలికాప్టర్లో ఉన్న ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందినట్లు కెన్యా సివిల్ ఏవియేషన్ అథారిటీ వెల్లడించింది.

ఆ పని చేస్తే నష్టపోతారు: ప్రపంచ దేశాలకు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్!
ఆ పని చేస్తే నష్టపోతారు: ప్రపంచ దేశాలకు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్!

ఇంటెలిజెన్స్ చీఫ్ సహా ఐదుగురు అమెరికన్ల మృతి
ఈ ప్రమాదంలో ఈక్వడార్ జాతీయ ఇంటెలిజెన్స్ చీఫ్ మిచెల్ సెన్సీ-కోంటుగి(42), ఆయన భార్య స్టెఫానీ ప్రాణాలు కోల్పోయినట్లు ఈక్వడార్ రవాణా మంత్రి రోబెర్టో లుకే ధ్రువీకరించారు. సెన్సీ-కోంటుగి ఈక్వడార్ అధ్యక్షుడు డేనియల్ నోబోవాకు అత్యంత సన్నిహితుడు. అలాగే ఈ ప్రమాదంలో మరణించిన మిగిలిన ఐదుగురు అమెరికా పౌరులని అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ ప్రకటించింది. మృతులలో ఫ్లోరిడాలోని ప్రముఖ స్పానిష్ మీడియా సంస్థ 'టెలెముండో' సీనియర్ మేనేజర్ జోస్ ఆల్బర్టో సువారెజ్ కూడా ఉన్నారు.

Kenya Helicopter Crash Kills Ecuador Intel Chief and 5 Americans Investigation Underway Details

క్లిష్టమైన ప్రాంతంలో ఘటన
ఈ ప్రమాదం పవిత్రంగా భావించే ఓలోలోక్వే పర్వత ప్రాంతంలో జరిగింది. కొండ దిగువన దట్టమైన నల్లటి పొగలు అలుముకున్న దృశ్యాలను కెన్యా రెడ్ క్రాస్ సోషల్ మీడియాలో పంచుకుంది. ప్రమాదం జరిగిన ప్రాంతం చాలా క్లిష్టమైనది కావడం, రాత్రి చీకటి పడటంతో సహాయక చర్యలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు సంబురు కౌంటీ పోలీస్ చీఫ్ డేవిడ్ న్కోరోయ్ వెల్లడించారు.

అమెరికా అప్పుల పురాణం: ఆ అంకెలు చూస్తే మైండ్ బ్లాకే!
అమెరికా అప్పుల పురాణం: ఆ అంకెలు చూస్తే మైండ్ బ్లాకే!

దర్యాప్తునకు ఆదేశం
టూరిస్టులను పసిఫిక్ సఫారీ హెలికాప్టర్లో తీసుకెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదని, ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (AAID), కెన్యా సివిల్ ఏవియేషన్ అధికారులు పూర్తిస్థాయి దర్యాప్తునకు ఆదేశించినట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+