పంచదారపై కేంద్రం కొత్త రూల్స్, ఇకపై 15 రోజులే ఛాన్స్..

వినాయక చవితి, దసరా, దీపావళి.. వరుస పండగల వేళ సామాన్యుడికి పంచదార ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. దేశంలో మార్కెట్ అవసరాలకు సరిపడా స్టాక్ లేకపోవడం, మరోపక్క రాబోయే పండగల సీజన్‌లో వినియోగం విపరీతంగా పెరగనుండటంతో చెక్కర ధరలు మునుపెన్నడూ లేనంత రికార్డు స్థాయికి చేరాయి. ఈ పరిణామం మధ్యతరగతి గృహిణులతో పాటు వ్యాపారులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. పరిస్థితి చేజారకముందే రంగంలోకి దిగిన కేంద్ర ప్రభుత్వం, మార్కెట్లో కృత్రిమ కొరతను అరికట్టేందుకు అత్యవసర చర్యలకు శ్రీకారం చుట్టింది.

ధరల మంటకు చెక్ పెట్టేందుకు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై నెలకు 10 మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువ పంచదారను వినియోగించే లేదా విక్రయించే పెద్ద వ్యాపారులు, పరిశ్రమలు తమ వద్ద కేవలం 15 రోజులకు సరిపడా నిల్వలను మాత్రమే ఉంచుకోవాలని స్పష్టం చేసింది. గతంలో ఈ నిల్వల పరిమితి 30 రోజులుగా ఉండేది. అయితే ధరలు ఏమాత్రం తగ్గకపోవడంతో ఈ నిబంధనను మరింత కఠినతరం చేశారు. కొత్తగా విధించిన ఈ నిబంధనలు సెప్టెంబర్ 1వ తేదీ నుంచి అమలులోకి వచ్చి, నవంబర్ 30 వరకు అమల్లో ఉంటాయని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

Sugar Stock Limit Tightened India Cuts Inventory Rules to 15 Days as Festive Prices Hit Record Highs
వరుసగా 14 రోజులు పంచదార మానేస్తే.. ఊహించని ఫలితం..!!
వరుసగా 14 రోజులు పంచదార మానేస్తే.. ఊహించని ఫలితం..!!

రికార్డు స్థాయికి చేరిన రేట్లు.. సామాన్యుడిపై మోయలేని భారం!

గత కొద్ది రోజులుగా బహిరంగ మార్కెట్లో చక్కెర ధరలు దాదాపు 10 శాతం వరకు పెరిగాయి. ఏడాది క్రితం క్వింటాల్ పంచదార మిల్లు ధర సుమారు రూ.3,900 ఉండగా, ప్రస్తుతం అది ఏకంగా రూ.5,400 నుండి రూ.5,500 స్థాయికి చేరడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

కేవలం మిల్లుల దగ్గరే కాకుండా, మన ఇంటికి దగ్గర్లో ఉండే కిరాణా షాపుల్లోనూ కేజీ నిత్యావసర చక్కెర రేటు 13 శాతానికి పైగా పెరిగి రూ.52 దాటిపోయింది. దీంతో పండగల సీజన్‌లో స్వీట్లు, పిండివంటలు తయారు చేసుకునే సామాన్యుడి బడ్జెట్ తలకిందులయ్యే పరిస్థితి ఏర్పడింది.

వర్షాభావం దెబ్బకు తగ్గిన దిగుబడి.. ముందున్న సవాళ్లు!

ఈ ఏడు చెరకు పండించే ప్రధాన ప్రాంతాల్లో వర్షపాతం సక్రమంగా లేకపోవడం, వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల దిగుబడి బాగా తగ్గిపోయింది. అక్టోబర్ 1 నుంచి ప్రారంభమయ్యే కొత్త సీజన్‌కు అవసరమైన పంచదార నిల్వలు దేశీయ అవసరాల కంటే తక్కువగా ఉండే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

 తేనె లేదా బెల్లమా?.. షుగరు బాధితులకు ఈ రెండింట్లో ఏది బెటర్..!?
తేనె లేదా బెల్లమా?.. షుగరు బాధితులకు ఈ రెండింట్లో ఏది బెటర్..!?

దేశీయంగా సుమారు 50 లక్షల టన్నుల నిల్వలు అవసరం ఉండగా, ప్రస్తుతం మన దగ్గర ఉన్న ఆరంభ నిల్వలు కేవలం 32 నుండి 42 లక్షల టన్నుల మధ్యనే ఉండే అవకాశం ఉంది. స్వీట్లు, బిస్కెట్లు, బేకరీ ఉత్పత్తుల తయారీదారుల నుంచి విపరీతమైన డిమాండ్ వస్తున్న తరుణంలో, అక్రమ నిల్వలను అడ్డుకుని అందరికీ అందుబాటు ధరల్లో చక్కెర లభించేలా చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+