రుషికొండ భవనాల వినియోగం పై కీలక ప్రకటన..!!
రుషికొండ భవనాల పై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. వైసీపీ హయాంలో నిర్మించిన ఈ భవనాల పై తొలి నుంచి వివాదం నెలకొంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ భవనాల వినియోగం కోసం చర్చలు.. సూచనల కోసం కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. టూరిజం, హోటళ్ల నిర్వాహకులతో చర్చలు చేసారు. కీలక ప్రతిపాదనలు సిద్దం చేసారు. కాగా.. ఇప్పుడు ఈ భవనాల విషయంలో మంత్రి కందుల దుర్గేష్ కీలక అంశాలను వెల్లడించారు.
రుషికొండ భవనాలతో పాటుగా గోదావరి పుష్కరాల ఏర్పాట్ల పైన టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్ కీలక అంశాలను వివరించారు. రాజమండ్రిలోని మంజీరా హోటల్‌లో రేపు(ఆదివారం) ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఏపీ టూరిజంలో ఏఐ టెక్నాలజీ కొత్త శకానికి వేదికవుతుందని అన్నారు. 130కి పైగా ప్రాంతాల్లో ఏఐ-ఎనేబుల్డ్ 'నివు' క్యూఆర్ కోడ్స్ ఆవిష్కరణ చేసి.. 130 భాషల్లో మాట్లాడే ఏఐ డిజిటల్ గైడ్‌ను రూపొందించామని తెలిపారు. 2027 గోదావరి పుష్కరాలే లక్ష్యంగా 'ది గోదావరి కాల్స్' ప్రచారానికి శ్రీకారం చుట్టామని వెల్లడించారు. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, క్రియేటర్లతో ఏపీ టూరిజంపై ప్రత్యేక ప్రచారం నిర్వహిస్తామని చెప్పారు. గోదావరి పుష్కరాల ద్వారా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు పర్యాటక రంగంగా అభివృద్ధి చెందుతాయని మంత్రి స్పష్టం చేశారు.

టూరిజం కు రుషికొండ భవనాలు
గోదావరి ప్రాంతంలో క్యూరేటెడ్ ఫామిలియా రైజేషన్ ట్రిప్స్ కోసం విశాఖపట్నం నుంచి హాప్-ఆన్ హాప్-ఆఫ్ డబుల్ డెక్కర్ బస్సులను రాజమండ్రికి తీసుకువస్తున్నామని తెలిపారు. రుషికొండ భవనాల పైనా కీలక అంశాలను ప్రస్తావించారు. రుషికొండ ప్యాలెస్ హోటల్ రూమ్‌లు వినయోగం కు అనుగుణంగా లేవని చెప్పుకొచ్చారు. రుషికొండ ప్యాలెస్ నిర్వహణకు సంస్థలు ముందుకు రావట్లేదని వెల్లడించారు. వీలైనంత త్వరగా రుషికొండ ప్యాలెస్‌ను వినియోగంలోకి తెస్తామని మంత్రి స్పష్టం చేసారు. రుషికొండ ప్యాలెస్‌ను ఆతిథ్య రంగానికే అప్పగిస్తామని ప్రకటించారు. విశాఖలో రిషికొండ అక్రమ నిర్మాణలపై సబ్ కమిటీ వేశామని మంత్రి తెలిపారు. జగన్ మళ్లీ అధికారంలోకి వస్తారానే దురాశతో ప్యాలస్‌లు నిర్మించుకున్నారని మండిపడ్డారు. త్వరలో జరిగే స్థానిక ఎన్నికల్లో కూటమి ధర్మాన్ని పాటిస్తామని.. సమిష్టిగా విజయం సాధిస్తామని వెల్లడించారు.













Click it and Unblock the Notifications
