వైభవ్ కంటే చిన్నోడే.. 11 ఏళ్లకే చరిత్ర సృష్టించిన బుడ్డోడు!

జపాన్‌కు చెందిన 11 ఏళ్ల ప్రాథమిక పాఠశాల స్టూడెంట్ యూకీ కురిహారా ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించి సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇండియాకు చెందిన 15 ఏళ్ల క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ కంటే కూడా వయస్సులో చిన్నవాడైన యూకీ.. ఈ-స్పోర్ట్స్ విభాగంలో ఈ ఘనత సాధించాడు. 1951లో ప్రారంభమైన ఆసియా క్రీడల చరిత్రలోనే అత్యంత చిన్న వయస్కుడైన స్వర్ణ పతక విజేతగా యూకీ కురిహారా గుర్తింపు పొందాడు.

రేపటి నుంచి టీమిండియా వన్డేల జాతర.. !!
రేపటి నుంచి టీమిండియా వన్డేల జాతర.. !!

ఫైనల్, సెమీ-ఫైనల్స్‌లో ఏకపక్ష ఆధిపత్యం
ఈ-స్పోర్ట్స్ పరిధిలోని 'పుయో పుయో ఛాంపియన్స్' ఈవెంట్ ఫైనల్లో యూకీ కురిహారా దక్షిణ కొరియాకు చెందిన కాంగ్ డాంగ్‌షిన్‌ను 10-2 తేడాతో ఘన విజయం సాధించి పసిడి పతకాన్ని కైవసం చేసుకున్నాడు. అంతకు ముందు జరిగిన సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో థాయ్‌లాండ్‌కు చెందిన 28 ఏళ్ల సీనియర్ క్రీడాకారుడు తానారక్ వోంగ్‌కిటికున్‌ను 10-1తో చిత్తు చేసి ఫైనల్‌కు దూసుకెళ్లాడు.

Asian Games 2026 11 Year Old Yuki Kurihara Creates History Wins Asian Games Gold Full Details Here

అప్పటి నుంచే శిక్షణ
కిండర్ గార్టెన్ వయసు నుంచే గేమింగ్‌పై విపరీతమైన ఆసక్తి పెంచుకున్న యూకీ కురిహారా.. ఈ పోటీల కోసం ప్రతిరోజూ సుమారు 8 గంటల పాటు కఠిన శిక్షణ పొందుతున్నాడు. గేమింగ్‌తో పాటు తన పాఠశాల చదువును కూడా బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఈల్ చేపల వంటకాలను ఎంతగానో ఇష్టపడే ఈ చిన్నారి అథ్లెట్ సాధించిన విజయం అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకుంటోంది.

ఫైనల్ లో ఇరాన్ ను కబడ్డీ ఆడేసిన భారత్
ఫైనల్ లో ఇరాన్ ను కబడ్డీ ఆడేసిన భారత్

విజయంపై చిన్నారి అథ్లెట్ అమాయక స్పందన
బంగారు పతకం సాధించిన అనంతరం యూకీ తన ఆనందాన్ని వ్యక్తపరుస్తూ.. తనకు లభించిన స్వర్ణ పతకం చాలా మెరుస్తూ, అందంగా, బరువుగా ఉందని చెప్పాడు. పతకంతో పాటు కానుకగా వచ్చిన బంగారు రంగు బొమ్మ తనకెంతో నచ్చిందని చాలా అమాయకంగా చెప్పడం గమనార్హం.

ఆసియా క్రీడల్లో ఈ-స్పోర్ట్స్ క్రేజ్
మూడేళ్ల క్రితం హౌంగ్‌జౌ ఆసియా క్రీడల్లో ఈ-స్పోర్ట్స్ తొలిసారిగా ప్రవేశపెట్టినప్పటి నుంచి ఈ గేమింగ్ ఈవెంట్లకు విశేష ఆదరణ లభిస్తోంది. ప్రస్తుత ఆసియా క్రీడల్లో యూకీతో పాటు హాంకాంగ్ కు చెందిన 12 ఏళ్ల కముస్ వాంగ్(స్కేట్ బోర్డింగ్), చైనాకు చెందిన 13 ఏళ్ల యూ జీడీ(స్విమ్మింగ్‌లో 3 గోల్డ్ మెడల్స్) వంటి పలువురు బాల అథ్లెట్లు స్వర్ణ పతకాలతో తమ సత్తా చాటుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+