టీజర్‌తోనే ఇంత ఇంపాక్టా?.. ఇక సినిమా థియేటర్లలో రిలీజైతే దబిడిదిబిడే!
సాత్విక్ వర్మ, అనీ ప్రధాన పాత్రల్లో నటించిన కొత్త సినిమా 'తొలి ప్రేమ కథ'. లిఖిత్, ఆదిత్య సమర్పణలో లతా కె ఈ సినిమాను నిర్మిస్తుండగా.. సాయి లక్ష్మణ్ అల్లు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ను చిత్ర బృందం ఇటీవల ఘనంగా విడుదల చేసింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు శైలేష్ కొలను, హీరో ఆకాష్ పూరి ముఖ్య అతిథులుగా హాజరై టీజర్‌ను ఆవిష్కరించారు.
సీజన్ కు సరిపడే సహజమైన సినిమా: శైలేష్ కొలను
టీజర్ విడుదల అనంతరం డైరెక్టర్ శైలేష్ కొలను మాట్లాడుతూ.. "ప్రస్తుత సీజన్‌కు సరిగ్గా సరిపోయే లవ్ స్టోరీ ఇది. ప్రేక్షకులు కూడా ఇలాంటి స్వచ్ఛమైన కథల కోసమే ఎదురుచూస్తున్నారు. టీజర్ చాలా హాయిగా, జెన్యూన్‌గా ఉంది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా రాణించిన సాత్విక్.. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. ఇందులో సినిమాటోగ్రఫీ, ధ్రువన్ అందించిన మెలోడీ మ్యూజిక్ అద్భుతంగా ఉన్నాయి. చివర్లో వచ్చే డైలాగ్స్, నటీనటుల సహజ సిద్ధమైన నటన ఆకట్టుకున్నాయి. ఇది కచ్చితంగా థియేటర్లోనే చూడాల్సిన సినిమా" అని శైలేష్ కొలను పేర్కొన్నారు.

బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయం సాధించాలి: ఆకాష్ పూరి
హీరో ఆకాష్ పూరి మాట్లాడుతూ.. "సాత్విక్, అనీ నాకు చిన్నప్పటి నుంచీ పరిచయం. వాళ్లిద్దరూ అద్భుతమైన పర్ఫార్మర్స్. టీజర్‌లో విజువల్స్ చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నాయి. ఈ సినిమా పెద్ద విజయం సాధించి, ప్రేక్షకులందరినీ థియేటర్లలో అలరించాలని కోరుకుంటున్నాను" అని అన్నారు. హీరో సాత్విక్ వర్మ మాట్లాడుతూ.. "మా సినిమాకు సపోర్ట్ చేయడానికి వచ్చిన శైలేష్‌కు , ఆకాష్‌కు నా ప్రత్యేక ధన్యవాదాలు. ధ్రువన్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఇది మంచి మ్యూజికల్ లవ్ స్టోరీగా మీ ముందుకు వస్తోంది" అని చెప్పారు.
డైరెక్టర్ సాయి లక్ష్మణ్ అల్లు మాట్లాడుతూ.. "కథ రాసుకున్నప్పుడు సాత్విక్, అనీలను మైండ్‌లో పెట్టుకున్నాను. అద్భుతమైన లొకేషన్లలో షూట్ చేశాం. సినిమా చాలా బాగా వచ్చింది. ప్రేక్షకులు థియేటర్లలో చూసి ఆదరించాలని" అని కోరారు. మ్యూజిక్ డెరెక్టర్ ఆర్.ఆర్. ధ్రువన్ మాట్లాడుతూ.. "ఈ సినిమా నాకు చాలా ప్రత్యేకమైనది. సినిమా చాలా బ్యూటిఫుల్‌గా వచ్చింది" అని వెల్లడించారు.














Click it and Unblock the Notifications
