టాలీవుడ్‌లో సరికొత్త చరిత్ర: బాలయ్య పేరు మీద చెక్కుచెదరని రికార్డులు!
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఐదు దశాబ్దాలకు పైగా తనదైన శైలిలో దూసుకుపోతూ, బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టిస్తున్న నందమూరి బాలకృష్ణ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. టాలీవుడ్‌లో ఎవరికీ సాధ్యం కాని, ఇప్పటివరకు ఎవరూ బీట్ చేయలేకపోయిన కొన్ని అరుదైన రికార్డులు బాలయ్య పేరిట ఉన్నాయి. ముఖ్యంగా 1974లో బాలనటుడిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి, ఆ తర్వాత హీరోగా మారిన ఆయన... నేటికీ కుర్ర హీరోలతో పోటీపడుతూ బాక్సాఫీస్ వద్ద వరుసగా రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు సాధిస్తుండటం టాలీవుడ్ చరిత్రలో ఒక అరుదైన రికార్డు.
ఏతరానికి చెందిన సీనియర్ హీరోకు కూడా సాధ్యం కాని విధంగా ఈ వయసులోనూ తన మాస్ ఇమేజ్‌ను, బాక్సాఫీస్ స్టామినాను ఏమాత్రం తగ్గకుండా కాపాడుకుంటున్న ఏకైక హీరో బాలకృష్ణ ఒక్కరే కావడం విశేషం. ఆయన అసాధారణ సినీ ప్రయాణానికి గుర్తింపుగా లండన్‌కు చెందిన ప్రఖ్యాత 'వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్' గోల్డ్ ఎడిషన్ గౌరవం కూడా దక్కింది.

ఏడాదిలో విజయాలు
ఈ ప్రత్యేకతతో పాటు టాలీవుడ్‌లో బాలయ్య సాధించిన మరో చారిత్రాత్మక రికార్డు ఒకే ఏడాదిలో అత్యధిక విజయాలు అందుకోవడం. 1986వ సంవత్సరంలో ఆయన ఏకంగా ఆరు బ్లాక్‌బస్టర్ సినిమాలను (ముద్దుల కృష్ణయ్య, సీతారామ కల్యాణం, అనసూయమ్మ గారి అల్లుడు, దేశోద్ధారకుడు, కలియుగ కృష్ణుడు, అపూర్వ సహోదరులు) టాలీవుడ్‌కు అందించారు. ఆ కాలంలోనే ఈ చిత్రాలన్నీ 100 రోజులకు పైగా ప్రదర్శించబడి సంచలనం సృష్టించగా, ఒకే కేలండర్ ఇయర్‌లో డబుల్ హ్యాట్రిక్ కొట్టిన ఈ రికార్డును ఇప్పటివరకు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఏ హీరో కూడా అందుకోలేకపోయారు.
ద్విపాత్రాభినయంలో రికార్డు
అంతేకాకుండా, టాలీవుడ్‌లో హీరోగా అత్యధిక సినిమాల్లో ద్విపాత్రాభినయం చేసిన ఘనత కూడా బాలకృష్ణ సొంతం. సుమారు 19కి పైగా చిత్రాల్లో ఆయన ద్విపాత్రాభినయంతో పాటు కొన్ని చిత్రాల్లో త్రిపాత్రాభినయం చేసి తన వర్సటైలిటీని అద్భుతంగా నిరూపించుకున్నారు. ఇక ఎన్టీఆర్ శకం తర్వాత టాలీవుడ్‌లో పౌరాణిక, చారిత్రాత్మక పాత్రలకు నిజమైన వారసుడిగా నిలిచింది బాలయ్యే. శ్రీకృష్ణదేవరాయలు, గౌతమీపుత్ర శాతకర్ణి వంటి చరిత్రాత్మక పాత్రలకు ప్రాణం పోసి, ఆ జానర్ సినిమాలను తన భుజాలపై మోయగల సత్తా ఒక్క నందమూరి బాలకృష్ణకే ఉందని నిరూపించారు. ఐదు దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణంలోనూ నేటికీ ట్రెండ్‌కు తగ్గట్లు మారుతూ, మాస్, క్లాస్ అనే తేడా లేకుండా బాక్సాఫీస్‌ను శాసిస్తున్న బాలయ్య శైలే వేరు.














Click it and Unblock the Notifications
