ఖైరతాబాద్ ఉప ఎన్నికలో పోటీ - కవిత సంచలనం..!!
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఖైరతాబాద్ ఉప ఎన్నిక కీలంగా మారుతోంది. దానం నాగేందర్ పైన అనర్హత వేటుతో ఉప ఎన్నిక ఖాయమైంది. ఖైరతాబాద్ సీటు ఖాళీ అయినట్లు నోటీపై ద్వారా త్వరలోనే షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. అధికార కాంగ్రెస్ లో ఇప్పటికే ఉప ఎన్నికలో పోటీ చేసే అభ్యర్ధి పైన చర్చ జరుగుతోంది. కేసీఆర్ తమ అభ్యర్ధిపైన ఒక నిర్ణయానికి వచ్చారు. కాగా.. ఇప్పుడు టీఆర్ఎస్ అధ్యక్షురాలు ఈ ఉప ఎన్నికలో పోటీ పైన కీలక ప్రకటన చేసారు. ఈ నిర్ణయం ఆసక్తి కరంగా మారుతోంది.
దానం నాగేందర్ పైన అనర్హత వేటుతో ఖైరతాబాద్ కు ఉప ఎన్నిక జరగనుంది. కోర్టు నిర్ణయంతో ఈ నియోజకవర్గం ఖాళీ అయినట్లు ఎన్నికల సంఘానికి సమాచారం అందించింది. దీంతో, వచ్చే వారం ఇక్కడ ఉప ఎన్నిక పైన షెడ్యూల్ విడుదల అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. కాగా.. కాంగ్రెస్ నుంచి దానం కు సీటు ఇస్తారా.. లేక ప్రచారంలో ఉన్నట్లు సీఎం సన్నిహితుడిని బరిలోకి దింపుతారా అనేది స్పష్టత రావాల్సి ఉంది. బీఆర్ఎస్ నుంచి తలసాని కుమారుడు, బీజేపీ నుంచి చింతల రామచంద్రారెడ్డి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. కాగా.. ఖైరతాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికలో తెలంగాణ రక్షణ సేన పోటీ చేస్తుందని ఆ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. ఉప ఎన్నికలో తమ అభ్యర్థిని నిలబెడతామని స్పష్టం చేశారు. ఓ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మరో పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేయడాన్ని తప్పుబట్టారు.

కవిత నిర్ణయంతో రాజకీయంగా చర్చ
దానం నాగేందర్ అంశం పైన స్పందిస్తూ.. ఇలా పార్టీ ఫిరాయింపు చర్యలు సమర్థనీయం కాదని కవిత వ్యాఖ్యానించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా సవరణపైనా కవిత స్పందించారు. క్లరికల్ తప్పిదాల కారణంగా అధికారులు ఓట్లు తొలగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయని అన్నారు. బీజేపీ ప్రోత్సాహంతో కుట్రపూరితంగా ఓట్ల తొలగింపు జరుగుతోందనే చర్చ ప్రజల్లో ఉందని కవిత పేర్కొన్నారు. ఆదిలాబాద్ రిమ్స్‌లో చిన్నారుల మరణాలు అత్యంత బాధాకరమని అన్నారు. తెలంగాణలో విద్య, వైద్య రంగాలను ప్రభుత్వం సరిదిద్దాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. చిన్నారుల మరణాలపై ప్రభుత్వం సమగ్రంగా దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైద్య సేవలు సరిగా అందక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. నిమ్స్, నీలోఫర్ వంటి ఆస్పత్రుల్లో మంత్రులు ఫోన్ చేసినా బెడ్లు దొరకని పరిస్థితి ఉందని చెప్పుకొచ్చారు. పదకొండు రకాల ఆరోగ్య పథకాలకు కాంగ్రెస్ ప్రభుత్వం తగిన బడ్జెట్ కేటాయించలేదని కవిత ఆరోపించారు. ఆరోగ్యశ్రీ బకాయిలనూ ఇప్పటికీ విడుదల చేయలేదని మండిపడ్డారు.












Click it and Unblock the Notifications
