రాష్ట్రాలకు కేంద్రం సంచలన ఆదేశాలు! ఆ పౌచ్‌లపై ఉక్కుపాదం

సిగరెట్లకు ప్రత్యామ్నాయంగా మార్కెట్లోకి వస్తున్న ప్రాణాంతక 'నికోటిన్ పౌచ్‌లు' ఇప్పుడు దేశంలో పెను కలకలం రేపుతున్నాయి. ఎలాంటి అనుమతులు లేకపోయినా అక్రమంగా దేశంలోకి రవాణా అవుతూ.. ఆన్‌లైన్ , స్థానిక దుకాణాల ద్వారా యువతను వ్యసనంపాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజా ఆరోగ్యాన్ని కాపాడేందుకు, ముఖ్యంగా చిన్నారులు , యువత ఈ ప్రమాదకర ఊబిలో చిక్కుకోకుండా ఉండేందుకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ రంగంలోకి దిగింది. అన్ని రాష్ట్రాలు తక్షణమే నికోటిన్ పౌచ్‌ల విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

నిషేధితమైనా ఆగని అక్రమ అమ్మకాలు.. ప్రభుత్వ హెచ్చరికలు

భారతదేశంలో పొగాకు సంబంధిత అనారోగ్యాల కారణంగా ఏటా దాదాపు 13.5 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ తరుణంలో ప్రభుత్వం ఇప్పటికే ఈ-సిగరెట్లను నిషేధించగా, కేవలం నికోటిన్ ప్యాచెస్, చూయింగ్ గమ్స్‌కు మాత్రమే అనుమతి ఉంది. అయితే ఎలాంటి పొగాకు లేకుండా కేవలం నికోటిన్‌ను మాత్రమే కలిగి ఉండే చిన్న పౌచ్‌లను పెదవుల కింద పెట్టుకునే ఈ సరికొత్త వ్యసనం దేశంలో చాపకింద నీరులా పాకింది. ఫిలిప్ మోరిస్ సంస్థకు చెందిన 'జిన్' (Zyn), వైట్ ఫాక్స్ వంటి గ్లోబల్ బ్రాండ్లు ఎలాంటి అనుమతులు లేకుండానే మన దేశంలోకి అక్రమంగా రవాణా అవుతున్నట్లు ప్రభుత్వ వర్గాలు గుర్తించాయి. 18 నుంచి 40 ఏళ్ల వయసు గల యువతే ప్రధానంగా వీటి బారిన పడుతున్నట్లు స్పష్టమైంది.

Health Ministry Directs States To Take Action Against Illegal Nicotine Pouches Threatening Youth
Burqa Ban: స్కూళ్లలో బుర్ఖాలపై బ్యాన్.. ప్రధాని మెలోని సంచలనం!
Burqa Ban: స్కూళ్లలో బుర్ఖాలపై బ్యాన్.. ప్రధాని మెలోని సంచలనం!

డ్రగ్ చట్టాల ప్రకారం తనిఖీలు, దాడులకు ఆదేశం

నికోటిన్ పౌచ్‌లు అత్యంత వ్యసనపకరమైనవని, ఇవి ఆరోగ్యానికి తీవ్ర ముప్పు తెచ్చిపెట్టడంతో పాటు ధూమపానం మాన్పించే సాధనాలుగా ఎక్కడా నిరూపితం కాలేదని కేంద్రం తేల్చిచెప్పింది. సెప్టెంబర్ 19న అన్ని రాష్ట్రాలకు రాసిన లేఖలో ఈ అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. డ్రగ్ చట్టంలోని నిబంధనల ప్రకారం అక్రమంగా వీటిని విక్రయించే వారిపై దాడులు నిర్వహించడం, స్టాక్‌ను సీజ్ చేయడం, చట్టపరమైన ప్రాసిక్యూషన్ చర్యలు చేపట్టడం వంటివి చేయాలని రాష్ట్ర ప్రభుత్కాలను ఆదేశించారు. చిన్నారుల భవిష్యత్తు దృష్ట్యా ఈ విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని స్పష్టం చేశారు.

పులస చేపను ఛీ కొట్టిన దేశం! దిగుమతులు బ్యాన్
పులస చేపను ఛీ కొట్టిన దేశం! దిగుమతులు బ్యాన్

విమానాశ్రయాల్లోనూ గుట్టుచాపుల అమ్మకాలు.. హైకోర్టు కీలక తీర్పు

ఇటీవల ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలోని డ్యూటీ-ఫ్రీ షాపుల్లో నికోటిన్ పౌచ్‌లను విక్రయించడం తీవ్ర వివాదాస్పదమైంది. దీనిపై అదానీ గ్రూప్ సంస్థలపై ఆరోపణలు రాగా, దేశీయ చట్టాలు తమకు వర్తించవంటూ వారు బాంబే హైకోర్టును ఆశ్రయించారు. అయితే డ్యూటీ-ఫ్రీ షాపులు కూడా దేశీయ చట్టాల పరిధిలోకి వస్తాయని స్పష్టం చేసిన హైకోర్టు, వారి వాదనలను తోసిపుచ్చింది. మరోవైపు డ్రగ్స్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డు కూడా ప్రజా ప్రయోజనాల దృష్ట్యా భవిష్యత్తులో ఎలాంటి కొత్త నికోటిన్ ఫార్ములేషన్లకు అనుమతి ఇవ్వకూడదని స్పష్టమైన సిఫారసు చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+