తిరుపతి: తిరుపతి శాసనసభా నియోజకవర్గంలో చిరంజీవి విజయం సాధించారు. ఆయన తన సమీప ప్రత్యర్థి కరుణాకర్ రెడ్డిపై పది వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. పాలకొల్లు శాసనసభా నియోజకవర్గంలో మాత్రం ఓటమి దిశగా సాగుతున్నారు. చిరంజీవిపై ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ఉషారాణి ఆధిక్యంలో ఉన్నారు. ప్రజారాజ్యం మరో సీనియర్ నేత టి.దేవేందర్ గౌడ్ ఓటమి దిశగా పయనిస్తున్నారు.