రాష్ట్రంలో కాంగ్రెస్ సంపూర్ణ విజయం
హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజారిటీ సాధించింది. సొంతంగా మెజారిటీ సాధించిన కాంగ్రెస్ పార్టీలో ఉత్సాహం వెల్లివిరిసింది. ముఖ్యమంత్రిగా మళ్ళీ వైఎస్ గద్దెనెక్కడం ఖాయమైంది. రాష్ట్రంలో కాంగ్రెస్ కు తానే బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించిన వైఎస్ కాంగ్రెస్ కు తెచ్చిపెట్టిన ఈ విజయం చరిత్రలో ప్రముఖంగా ప్రస్తావించదగినది. మహాకూటమి పేరిట తెలుగుదేశం తెరాస, వామపక్షాలను కలుపుకున్నా చివరికి విజయం కాంగ్రెస్ నే వరించింది.
రాష్ట్ర అసెంబ్లీలో 294 స్ధానాలు ఉండగా 157 కు పైగా స్ధానాల్లో విజయం సాధించింది. తెలుగుదేశం నాయకత్వంలోని మహాకూటమికి 105, ప్రజారాజ్యం పార్టీకి 19, వామపక్షాలు, బిజెపి, ఇతరులకు కలిపి 13 స్ధానాలు దక్కాయి.












Click it and Unblock the Notifications