హైదరాబాద్: సికింద్రాబాద్ శాసనసభా నియోజకవర్గం నుంచి కాంగ్రెసు అభ్యర్థి, సినీ నటి జయసుధ విజయం సాధించారు. ఆమె తన సమీప తెలుగుదేశం ప్రత్యర్థి తలసాని శ్రీనివాస యాదవ్ పై విజయం సాధించారు. వ్యూహాత్మకంగా ఈ స్థానం నుంచి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి జయసుధను పోటీకి దింపారు. సికింద్రాబాదులోని కాంగ్రెసు నాయకులంతా కలిసికట్టుగా పని చేయడం జయసుధకు ఉపకరించింది. అంతే కాకుండా క్రైస్తవ మైనారిటీ ఓటర్లు గణనీయమైన సంఖ్యలో ఉన్నారు.