హైదరాబాద్: రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు కుమారుడు కెటి రామారావు సిరిసిల్ల నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. రాష్ట్ర మంత్రి గల్లా అరుణ కుమారి చంద్రగిరిలో రోజాపై గెలిచారు. తెరాస శాసనసభా పక్షం నాయకుడు ఈటెల రాజేందర్ హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. అంబర్ పేట నియోజకవర్గం నుంచి బిజెపి అభ్యర్థి కిషన్ రెడ్డి విజయం సాధించారు. మంత్రి ఫరీదుద్దీన్ ను ఆయన ఓడించారు. బిజెపి ప్రముఖ నాయకుడు సిహెచ్ విద్యాసాగరరావు తన అన్న కొడుకు సిహెచ్ రమేష్ చేతిలో ఓటమి పాలయ్యారు. సిద్ధిపేట నియోజకవర్గం నుంచి తెరాస నాయకుడు హరీష్ రావు విజయం సాధించారు.