లోకసభ ఎన్నికల ఫలితాలు-2009

కాంగ్రెస్ కూటమి 262
బిజెపి కూటమి 157
మూడో కూటమి 67
నాలుగో కూటమి 30
ఇతరులు 27
సోనియా ఇంటి వద్ద సంబరాలు
దేశరాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. యూపీఏ కూటమి ముందంజలో దూసుకు పోతున్న నేపథ్యంలో 10 జనపథ్‌లోని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా ఇంటి ముందు ఆ పార్టీ కార్యకర్తలు పండగ చేసుకుంటున్నారు. యూపీఏ 239 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. బిజెపి నాయకత్వంలోని ఎన్డీయే కూటమి 154 స్ధానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది.
10:46AM
యుపిఎదే ఆధిక్యం
కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఎ కూటమి ఆధిక్యతలో కొనసాగుతోంది. యుపిఎ 200కు పైగా సీట్ల ఆధిక్యతలో కొనసాగుతోంది. ఇప్పటి వరకు ప్రకటించిన స్థానాల్లో యుపిఎకు 2 సీట్లు రాగా, బిజెపికి 3, వామపక్షాలకు 1 సీటు వచ్చాయి.
10:39AM
యుపిఎకు స్వల్ప ఆధిక్యం
దేశంలోని లోకసభ ఎన్నికల్లో కాంగ్రెస్ స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతోంది. కాంగ్రెస్ కూటమి 154 స్థానాల్లో, బిజెపి కూటమి 96 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. వామపక్షాలు 14 సీట్లలో ఆధిక్యంలో ఉన్నారు. ఎస్పీ మూడు స్థానాల్లో, బిఎస్పీ 13 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. ఇతరులు 35 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.
9:13AM
ఆధిక్యంలో బిజెపి కూటమ
లోకసభ ఎన్నికల్లో బిజెపి కూటమి ముందంజలో ఉంది. బిజెపి కూటమి 27 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా కాంగ్రెసు కూటమి 19 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. వామపక్షాలు ఒక స్థానంలో ఆధిక్యంలో ఉన్నాయి. ఇతరులు మూడు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.
8:31AM












Click it and Unblock the Notifications