హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ రాణించడం కొందరికి అశనిపాతంలా పరిణమించింది. రాజశేఖరరెడ్డి ఒంటి చేత్తో కాంగ్రెస్ ను గెలిపించుకోగలిగారు. దీనితో టిడీపి మీడియా సంస్ధలుగా పేరుపడిన పత్రికలకు, టీవీ చానళ్ళకు ఇబ్బందికరమైన పరిస్ధితి ఏర్పడింది. రామేశ్వరం వెళ్ళినా శనీశ్వరం వదలనట్టు ఉంది ఈనాడు రామోజీరావు పరిస్ధితి. తమ చిరకాల శతృవు ఉండవల్లి అరుణ్ కుమార్ రాజమండ్రిలో ఓడిపోతున్నా, ప్రభుత్వం ఏర్పాటు చేసేది రాజశేఖరరెడ్డేనని తెలియడంతో ఆయనకు ఇబ్బందికర పరిస్ధితి ఏర్పడింది. మార్గదర్శి గండం నుంచి ఆయన బయటపడినా, ఇక మీదట ఆయన సాక్షి మీడియా గ్రూపు నుంచి వ్యాపారపరమైన పోటీని ఎదుర్కోవలసి ఉంటుంది. టిడిపి జేబు సంస్ధలుగా ముద్రపడిన కొన్ని టీవీ చానళ్ళకు కూడా ఇబ్బందికరమైన పరిస్ధితే.