హైదరాబాద్: రాష్ట్రంలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కాంగ్రెస్ ముందంజలో ఉన్నట్టు ఫలితాల ధోరణులు సూచిస్తున్నాయి. దింపుడు కళ్ళం ఆశగా టిడీపి చిరు పార్టీ మద్దతు కోసం ప్రయత్నిస్తోంది. రాష్ట్రంలో దాదాపు హంగ్ ఖాయమని తేలడంతో టీడీపీ పొత్తుల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఎలాగైనా అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో పీఆర్‌పీతో మంతనాలు జరపుతోంది. ఇందుకోసం టీడీపీ నాయకులు, సినీ ప్రముఖులు అశ్వనీ దత్, రాఘవేంద్రరావులతో రాయబారం పంపింది. చిరుతో వీరిద్దరూ మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం.
టిడీపి నగదు బదిలీ పథకం అంతగా పనిచేయలేదు. అలాగే మహా కూటమిలోని మిత్రపక్షాల మధ్య ఓట్ల బదిలీ కూడా ఆశించిన స్ధాయిలో జరుగలేదు. మహాకూటమి క్లిక్ కాకపోవడానికి ఇవి ప్రధాన కారణాలు.