హైదరాబాద్: ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి కుమారుడు, కాంగ్రెస్ అభ్యర్థి వైయస్ జగన్మోహన్ రెడ్డి కడప లోకసభ స్థానం నుంచి ఘన విజయం సాధించారు. ఆయన లక్షా 79 వేల ఓట్ల మోజారిటీతో విజయం సాధించారు. అనకాపల్లి లోకసభ స్థానం నుంచి ప్రజారాజ్యం పార్టీ నేత, చిరంజీవి బావమరిది అల్లు అరవింద్ ఓడిపోయారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి సబ్బం హరిపై 22 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు.
కాగా, ప్రజారాజ్యం పార్టీ నాయకుడు టి. దేవేందర్ గౌడ్ రెండు చోట్లా ఓటమి పాలయ్యారు. ఇబ్రాహింపట్నం శాసనసభా నియోజకవర్గం నుంచి, మల్కాజిగిరి లోకసభ స్థానం నుంచి ఆయన ఓడిపోయారు. రాష్ట్ర మంత్రి మండలి బుద్ధప్రసాద్ ఓడిపోయారు.