హైదరాబాద్: కడప జిల్లా పులివెందుల శాసనసభ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ఘన విజయం సాధించారు. ఆయన తన ప్రత్యర్థిపై 68 వేల ఓట్ల పైచిలుకు మెజారిటీతో విజయం సాధించారు. నెల్లూరు జిల్లాలో మంత్రి ఎన్ రాజ్యలక్ష్మి ఓడిపోయారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం నుంచి మంత్రి సబితా ఇంద్రారెడ్డి గెలిచారు.
వనపర్తి నియోజకవర్గంలో మంత్రి చిన్నారెడ్డి ఓడిపోయారు. డోర్నకల్ లో మరో మంత్రి రెడ్యా నాయక్ ఓడిపోయారు. అద్దంకిలో కరణం బలరాం ఓటమి పాలయ్యారు.