రాహుల్ గాంధీపై ప్రశంసల జల్లు
న్యూఢిల్లీ : కేంద్రంలో కాంగ్రెస్ అధిక స్ధానాలు సంపాదించుకోవడంలో రాహుల్‌గాంధీ పోషించిన పాత్ర కీలకమని కాంగ్రెస్ యువ ఎంపీలు ఆయనపై ప్రశంసల జల్లు కురిపించారు. అజ్మీర్‌నుంచి ఎన్నికయిన సచిన్‌పైలెట్ మాట్లాడుతూ రాహుల్ చేసిన కృషి వల్లనే ఈ విజయం సాధ్యమైందని అన్నారు. ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ తిరిగి పుంజుకోవడంలో రాహుల్‌గాంధీ పాత్ర చిరస్మరణీయమని ఆ రాష్ట్రంనుంచి గెలుపొందిన జితిన్‌ప్రసాద అన్నారు.రాహుల్ గాంధీకి కేబినెట్ మంత్రి పదవి ఇస్తామని ప్రధాని మన్మోహన్ సింగ్ నిన్న ప్రకటించిన విషయం తెలిసిందే.రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావలని ఆయన కోటరీ ఆకాంక్షిస్తోంది. అందుకు చాలా సమయముందని సోనియా కుటుంబ శ్రేయోభిలాషులు అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications