వైఎస్ ప్రమాణ స్వీకారోత్సవం!
హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ రెండోసారి పగ్గాలు చేపట్టనున్నారు. కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ శాసనసభ్యుల సమావేశం ఈ నెల 19న జరిగే అవకాశ మున్నట్లు తెలిసింది. ఈ సమావేశంలో శాసనసభ్యులు ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డిని తిరిగి తమ నేతగా ఎన్నుకునే అవకాశ ముంది. సహజంగా సిఎల్‌పి నేతగా వై.ఎస్. ఎన్నిక కానున్నం దున ఆయన ఈ నెల 20వ తేదీన ముఖ్యమంత్రిగా ఎల్ బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసే అవకాశముంది. ఇదిలావుంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలుపొటములకు తనదే బాధ్యత అని వై.ఎస్. భుజాన వేసుకున్న సంగతి విధితమే. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన నేపథ్యంలో ఆయన ఆదివారం నాడు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీలో ఆయన పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, ఇతర సీనియర్ నేతలతో కలవనున్నారు.












Click it and Unblock the Notifications