చిరంజీవి ఫ్యాన్ ఆత్మహత్య
కాకినాడ: పాలకొల్లులో ప్రజారాజ్యం అధినేత చిరంజీవి ఓడిపోయారనే వార్త విన్న ఆయన అభిమాని ఒకతను ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం రాత్రి అతను ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. నల్లా నారాయణ అనే 45 ఏళ్ల ఆ అభిమాని తన ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
నారాయణ పశ్చిమ గోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం కొత్తలంక గ్రామానికి చెందినవాడు. పురుగుల మందు తాగిన అతన్ని చికిత్స నిమిత్తం అమలాపురం ఆస్పత్రికి తరలించారు. అయితే అతను సోమవారం ఉదయం మరణించాడు.












Click it and Unblock the Notifications