తమిళ టైగర్ ప్రభాకరన్ కాల్చివేత

ఇద్దరు సన్నిహిత సహచరులతో ప్రభాకరన్ అంబులెన్స్ లో పారిపోవడానికి ప్రయత్నించాడని, అయితే అయనపై దాడి చేసి చంపినట్లు రక్షణాధికారి చెప్పారు. అనుచరులు ఇద్దరు కూడా మరణించారని, ఈ విషయంపై లాంఛనంగా ప్రకటన వెలువడుతుందని ఆ అధికారి చెప్పారు.
ఎల్టీటిఇ నేత ప్రభాకరన్ ను బతికే ఉన్నాడని, ప్రభుత్వ బలగాలు అతన్ని చుట్టుముట్టాయని శ్రీలంక సైన్యం చెప్పిన కొద్ది నిమిషాలకే అతను మరణించినట్లు వార్తలు వచ్చాయి. అడవిలోని చిన్న ప్రాంతంలో ప్రభాకరన్ 200 టైగర్ల రక్షణలో ఉన్నట్లు సైనిక అధికార ప్రతినిధి చెప్పినట్లు బిబిసి వార్త వచ్చింది. సోమవారం ఉదయం సీనియర్ తిరుగుబాటు నాయకులు కాల్పుల్లో మరణించారు. వీరిలో టైగర్ల రాజకీయ విభాగం అధిపతి బాలసింఘం నదేశన్, పీస్ సెక్రటేరియట్ అధిపతి సీవరత్నం పులిదేవన్, సైనిక నాయకుడు రమేష్ ఉన్నారు.












Click it and Unblock the Notifications