హైదరాబాద్: తెలంగాణ విషయంలో కాంగ్రెస్ వైఖరిని ప్రజలు నమ్మారని, అందుకే సగం స్థానాల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించారని నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు మధుయాష్కీ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)తో పాటు కాంగ్రెస్ లోని కొందరు నాయకులు తెలంగాణ వాదాన్ని పక్కన పెట్టడం వల్లే ఓటమి పాలయ్యారని ఆయన అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ చరిష్మాతోపాటు తెలంగాణ వాదంపై ఉన్న చిత్తశుద్దే తనను పార్లమెంటు సభ్యుడిగా గెలిపించిందని ఆయన అన్నారు.