వైయస్సే మెగాస్టార్:ఉషారాణి
హైదరాబాద్: ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డే నిజమైన మెగాస్టార్ అని పాలకొల్లు శాసనసభా స్థానంలో చిరంజీవి ఓడించిన ఉషారాణి అంటున్నారు. తనను జెయింట్ కిల్లర్ అంటున్నారని ఆమె చెప్పుకున్నారు. చిరంజీవిపై తాను గెలవడం ఆనందంగా ఉందని ఆమె అన్నారు.
ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకుల కృషి తనను గెలిపించినట్లు ఆమె చెబుతున్నారు. ఎన్నికల ఫలితాల ద్వారా సామాజిక న్యాయం అంటే ఏమిటో తనకు తెలిసి వచ్చిందని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications