చిరు వల్లే మా ఓటమి: ఎర్రబెల్లి
హైదరాబాద్: చిరంజీవి నేతృత్వంలోని ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావం వల్లనే తమ పార్టీ ఓడిపోయిందని తెలుగుదేశం నాయకుడు ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. మహిళలు, యువకులు ప్రజారాజ్యం పార్టీకి ఓటేశారని, లోకసత్తాకు విద్యావంతులు, ఉద్యోగులు ఓటేశారని, దీని వల్ల తమ పార్టీకి నష్టం జరిగిందని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు.
ప్రజారాజ్యం, లోకసత్తా పార్టీలు లేకపోతే మహా కూటమి గెలిచి ఉండేదని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ఐదేళ్ల పాలనపై అవినీతి ముద్ర పడిందని, ఇకనైనా రాజేశఖర రెడ్డి అవినీతి రహిత ప్రభుత్వాన్ని అందించడం అవసరమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications