కాంగ్రెసుకు జెడి (ఎస్) మద్దతు
న్యూఢిల్లీ: ముగ్గురు పార్లమెంటు సభ్యులు గల జెడి (ఎస్) కాంగ్రెసుకు మద్దతు ప్రకటించింది. కేంద్రంలో కాంగ్రెసు ఏర్పాటు చేస్తున్న లౌకిక ప్రభుత్వానికి మద్దతు ప్రకటిస్తున్నట్లు జెడి (ఎస్) నాయకుడు హెచ్ డి కుమారస్వామి మంగళవారం చెప్పారు.
కాంగ్రెస్ తమ మద్దతు కోరిందని, తాము లౌకిక శక్తులను బలపరచదలుచుకున్నామని, సమన్వయ సాధనతో పని చేయాలని కాంగ్రెస్ నాయకులు కోరారని, తాము మద్దతిస్తున్నామని ఆయన అన్నారు. కుమారస్వామి సోమవారం కాంగ్రెస్ నాయకుడు గులాం నబీ ఆజాద్ ను కలిశారు. కర్ణాటక అభివృద్ధికి ప్రయోజనం చేకూర్చారలని మాత్రమే తాము కాంగ్రెసును కోరుతున్నామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications