అగ్ని-2 క్షిపణి ప్రయోగం సక్సెస్
భువనేశ్వర్: న్యూక్లియర్ కేపెబుల్ అగ్ని-2 క్షిపణిని ఒరిస్సాలోని డిఫెన్స్ బేస్ నుంచి మంగళవారం విజయవంతంగా ప్రయోగించారు. ఉపరితలం నుంచి ఉపరితలానికి సంబంధించిన 2 వేల కిలోమీటర్లకు పైగా రేంజ్ గల ఈ క్షిపణిని భువనేశ్వర్ కు 150 కిలోమీటర్ల దూరంలో గల భద్రక్ జిల్లా ధమారా సమీపంలోని వీలర్స్ ఐలాండ్ నుంచి ప్రయోగించారు.
క్షిపణిని కాల్సడంలో సైనిక విశ్వాసాన్ని అందించడానికి ఈ ప్రయోగ ఉద్దేశ్యమని చెబుతున్నారు. ఇది యూజర్ ట్రయల్ అని చెప్పారు. 16 టన్నుల బరువుగల ఈ క్షిపణి వేయి కిలోల బరువును మోసుకుని వెళ్లగలుగుతుంది. దీన్ని రోడ్ మొబైల్ లాంచర్ల నుంచి కూడా కాల్పవచ్చు.












Click it and Unblock the Notifications