హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సిఎంగా 20న వైయస్ ప్రమాణం

By Staff
|
Google Oneindia TeluguNews

YS Rajasekhar Reddy
హైదరాబాద్: ముఖ్యమంత్రిగా వైయస్ రాజశేఖర రెడ్డి రెండో సారి ఈ నెల 20వ తేదీ బుధవారం రాత్రి ఏడున్నర గంటలకు ప్రమాణ స్వీకారం చేస్తారు. కాంగ్రెస్‌ కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు మంగళవారం నాంది పలుకుతున్నారు. ఇదే రోజున శాసనసభ రద్దుకు మంత్రిమండలి సిఫార్సు చేస్తుంది. కాంగ్రెస్‌ శాసనసభాపక్ష నేతగా వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డిని మంగళవారం లాంఛనంగా ఎన్నుకుంటారు. సాయంత్రం ఆరు గంటలకు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రిమండలి సమావేశమవుతుంది. ప్రభుత్వం రద్దుకు తీర్మానం చేసి దాన్ని గవర్నరుకు పంపిస్తారు. అనంతరం 6.30కు గాంధీభవన్‌ లో పీసీసీ కార్యనిర్వాహక కమిటీ సమావేశమై సీఎల్పీ ఎన్నిక తదితర అంశాలపై చర్చిస్తుంది. రాత్రి 7.30కు శాసనసభ కమిటీ హాల్‌లో కాంగ్రెస్‌ శాసనసభ్యులు సమావేశమై సీఎల్పీనేతగా వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డిని ఎన్నుకుంటారు. మంత్రి మండలి సిఫార్సును గవర్నర్‌ ఆమోదించి సీఎల్పీ నేతను కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆహ్వానిస్తారు.

బుధవారం రాత్రి ఏడుగంటలకు వై.ఎస్‌. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. కాంగ్రెస్‌ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది. 2004లో మాదిరిగానే మంత్రివర్గంలో ముఖ్యమంత్రి ఒకరే బుధవారం ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ కార్యక్రమం కోసం ఎల్బీస్టేడియంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎల్పీ నేత ఎన్నికకు ఏఐసీసీ తరఫున పరిశీలకుడిగా సీడబ్ల్యుసీ ప్రత్యేక ఆహ్వానితుడు వీరప్పమొయిలీ హాజరవుతారు.

ఎల్బీస్టేడియంలో ప్రమాణస్వీకార ఏర్పాట్లను కేవీపీ రామచంద్రరావు, మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, రఘువీరారెడ్డి, బొత్స సత్యనారాయణ, ముఖేష్‌, కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎంపీ అంజన్‌కుమార్‌ యాదవ్‌, ఎమ్మెల్యేలు వట్టి వసంత్‌కుమార్‌, శంకర్‌రావు, దానం నాగేందర్‌, సుధీర్‌రెడ్డి తదితరులు సమీక్షించారు. అంతకు ముందు భద్రత ఏర్పాట్లు, సౌకర్యాల కల్పనపై అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రమాణస్వీకారం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం గత ఐదేళ్లలో సాధించిన అభివృద్ధిపై ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకుడు డా.రాళ్లబండి కవితాప్రసాద్‌ వెల్లడించారు.

ఇటీవలి ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున ఎన్నికైన 157 మంది ఎమ్మెల్యేలు, 33 మంది లోక్‌ సభ సభ్యులను పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌ అభినందించారు. పార్టీ కార్యకర్తలకు గుర్తింపునివ్వాలని ప్రజాసేవలో వారిని భాగస్వామ్యుల్ని చేయాలని ఒక ప్రకటనలో కోరారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X