25న వైయస్ మంత్రి వర్గం

తాను రూపొందించుకున్న జాబితాను సోనియా ముందుంచాలని వైయస్ భావిస్తున్నారు. 22న కేంద్రమంత్రివర్గం ఏర్పాటు కూడా ఉండడంతో ఆరోజు సోనియా అప్పాయింట్ మెంట్ పై సందేహాలున్నాయి. ఆ రోజు సోనియాతో భేటీ కుదిరితే అదే రోజు జాబితాకు ఆమోదముద్ర లభిస్తుంది. ఆ తరువాతి రోజు అంటే 23న తన తండ్రి రాజారెడ్డి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనేందుకు వైఎస్ పులివెందుల వెళ్తారు. 25వ తేదీన మంత్రి వర్గ ప్రమాణ స్వీకారాన్ని పెట్టుకుంటారని అంటున్నారు. మంచి ముహూర్తాలను బట్టి తేదీ మారినా మారవచ్చు. అయితే వైఎస్ 27 ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరి ప్రత్యేక విమానంలో జెరూసలేం వెళ్తున్నారు. తిరిగి 29 రాత్రికి హైదరాబాద్ చేరుకుంటారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో 26లోగానే మంత్రివర్గం ఏర్పాటు జరిగి తీరుతుంది.












Click it and Unblock the Notifications