టవర్ కూలి ఐదుగురి మృతి
ఆదిలాబాద్: నిర్మాణంలో ఉన్న ఓ విద్యుత్ టవర్ కుప్పకూలి అక్కడ పనిచేస్తున్న 5గురు కూలీలు మృతి చెందారు.మంచిర్యాల మండలం ముల్కాల వద్ద ఈరోజు టవర్ నిర్మాణంలో భాగంగా భూమిలో సిమెంట్ లైనింగ్ చేస్తుండగా అకస్మాత్తుగా టవర్ కుప్పకూలింది. దీంతో అందరూ శిథిలాల్లో చిక్కుకుని పోయారు. ఇప్పటికి 5 మృతదేహాలను బయటకు తీశారు. ఇందులో ముగ్గురు మహిళలు ఉండగా ఇద్దరు పురుషులు ఉన్నారు. వీరంతా మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రకు చెందినవారు. తీవ్రంగా గాయపడిన పలువురిని 108లో ఆసుపత్రికి తరలించారు. శిథిలాలకింద ఇంకా 15 మంది ఉన్నట్లు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications