ఎన్‌కౌంటర్‌లో పటేల్ సుధాకర్ మృతి
వరంగల్: మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు పటేల్ సుధాకరరెడ్డి పోలీసులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందాడు.వరంగల్ జిల్లా తాడ్వాయి మండలం లవ్వాల అడవుల్లో ఈ ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో సుధాకర్‌రెడ్డి, అతనితో పాటు జిలాల కమిటీ సభ్యుడు డీసీఎం వెంకటయ్య కూడా మృతి చెందాడు. సుధాకర్‌రెడ్డి 2003లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై అలిపిరి వద్ద జరిపిన మావోయిస్టు దాడిలో ప్రధాన నిందితుడు.
దివంగత మాజీ హోంమంత్రి మాధవరెడ్డితో పాటు ఐపీఎస్ అధికారి ఉమేష్‌చంద్ర హత్య కేసుల్లో కూడా ప్రధాన నిందితుడుగా ఉన్నాడు. సుధాకర్‌రెడ్డి మహబూబ్‌నగర్ జిల్లా గద్వాల ప్రాంతం మల్దకల్ మండలం కడ్తిరావుల చెరుకు చెందినవాడు. సుధాకర్‌పై రూ.12 లక్షల రివార్డు కూడా ఉంది. ప్రస్తుతం మహారాష్ట్ర బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.
పటేల్ సుధాకర్‌రెడ్డి చనిపోవడంతో ఆయన స్వగ్రామం కుర్తిరావుల చెరువులో విషాదచాయలు అలుముకున్నాయి. టీవీలో చూడటం ద్వారానే తమకు విషయం తెలిసిందని గ్రామస్తులు అంటున్నారు. గతంలో ఎన్నో సార్లు పోలీసులకు చిక్కినట్లే చిక్కి తప్పించుకోవడంలో సుధాకర్ దిట్ట అని... అయితే పోలీసులు జరిపిన ఎన్‌కౌంటర్‌పై వారు అనుమానం వ్యక్తం చేశారు. సుధాకర్‌రెడ్డికి భార్యతో పాటు ఓ కుమారుడు ఉన్నాడు. భార్య గతంలో దళంలో పనిచేసి అనారోగ్యం కారణంగా ఆరేళ్ల క్రితం లొంగిపోయారు.
కుమారుడు శేషారెడ్డి హైదరాబాద్‌లో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఉస్మానియా యూనివర్సీటిలో ఎంఏ చేస్తున్న సమయంలో 1981లో దళంలో చేరి గత 25 ఏళ్లుగా అజ్ఞాతంలోకి వెళ్లారు. రెండేళ్ల క్రితం రాష్ట్రాని వదిలి వెళ్లిన సుధాకర్ కొన్ని రోజులు జార్ఖండ్ రాష్ట్ర బాధ్యతలు నిర్వహించారు. మావోయిస్టు ఇంటలిజెన్స్ చీఫ్‌గా ఉన్న ఆయన కొంత కాలం క్రితమే మహారాష్టక్రు వచ్చాడు. నాలుగు రోజుల క్రితం మహారాష్టల్రో పట్టుకొని ఇక్కడికి తీసుకొచ్చి సుధాకర్‌రెడ్డిని పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారని ఆయన సోదరుడు ప్రభాకర్‌రెడ్డి ఆరోపిస్తున్నాడు.
-
మహేశ్‌కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్‌కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!!












Click it and Unblock the Notifications