అరవింద్ రాజీనామా చేయాలి

అదే సమయంలో కేవీ రావు మాట్లాడుతూ... "రాజుగారి భార్య పతివ్రత అయితే సరిపోదు, పతివ్రతలా కనిపించాలి'' అన్నట్టు తెలిసింది. పైస్థాయిలో డబ్బులు చేతులు మారకపోయినా ద్వితీయశ్రేణి నేతలు వసూలు చేశారన్న వాదన వినిపించినట్టు తెలిసింది. మరోవైపు తాను రెండు స్థానాల నుంచి పోటీచేసి ఉండాల్సింది కాదని సీనియర్ నేత దేవేందర్‌గౌడ్ అభిప్రాయపడినట్టు తెలిసింది.
పూర్తిస్థాయిలో పార్టీకోసం పని చేయలేకపోయానన్న భావననూ ఆయన వ్యక్తం చేసినట్టు తెలిసింది. అలాగే "ఎన్టీఆర్ దగ్గర పనిచేశాను. అలాగే మీవద్ద చేశాను. మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చూడాలనుకున్నా... నా కోరిక తీరలేదు. భవిష్యత్‌లో మీరు కచ్చితంగా సీఎం అవుతారు. నేను డయాలసిస్ పేషెంట్‌ని. బహుశా వచ్చేసారికి ఉంటానో లేదో. అడ్వాన్స్ కంగ్రాచ్యులేషన్స్'' అని పీఆర్పీ సీనియర్ నేత ఉపేంద్ర చేసిన వ్యాఖ్యలు పీఏసీ సమావేశంలో ఒకింత ఉద్విగ్నతను సృష్టించినట్టు తెలిసింది.ఉపేంద్ర చేసిన వ్యాఖ్యలకు చిరంజీవి చలించిపోయారు. అప్పుడు మొదటి బొకే మీ నుంచే అందుకుంటానని ఆయనతో అన్నట్లు తెలిసింది.
ఇక చిరంజీవి మాత్రం 'గెలిచి ఉంటే అన్నీ నేర్చుకోవడానికి అవకాశముండేది కాదు. ఓడిపోవడం కూడా ఒక విధంగా అదృష్టమే. అన్ని విషయాలూ తెలుసుకోవడానికి అవకాశమిచ్చింది. రాజకీయాలపై పట్టుసాధిస్తాను' అని పార్టీ అధినేత చిరంజీవి అనడం గమనార్హం. దీనిపై కమిటీ సభ్యులంతా చప్పట్లు కొట్టి అభినందించినట్లు సమాచారం. కాపు వర్గాన్ని పార్టీ దూరంగా ఉంచటం నష్టపరిచిందని, వారిలో అపనమ్మకాన్ని పెంచిందని మరో నేత వేదవ్యాస్ అన్నట్లు సమాచారం. ఇతర వర్గాలు కూడా మద్దతివ్వలేదని, ఈవీఎంల్లో ఏదైనా మతలబు ఉందేమో పార్టీ దృష్టి కేంద్రీకరించాలని కూడా ఆయన సూచించినట్లు తెలిసింది. చివరిగా.. పార్టీని అన్నివిధాలుగా పునర్వ్యవస్థీకరించే అధికారాన్ని సమావేశం చిరంజీవికి కట్టబెట్టింది.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications