విజయశాంతి కాంగ్రెస్ కోవర్టు
హైదరాబాద్: తమను కాంగ్రెస్ తొత్తులుగా విజయశాంతి అనటాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి అసమ్మతినేత రవీంద్రనాయక్ తప్పుపట్టారు. ఆమే కాంగ్రెస్ కోవర్టు అని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి అసమ్మతి నేతలు మరోసారి పార్టీ అధినేత కేసీఆర్‌పై, ఎంపీ విజయశాంతి, శాసనసభా పక్ష నేత ఈటెల రాజేందర్‌పై నిప్పులు చెరిగారు. తమను ఎమ్మెల్సీ పదవులకు రాజీనామాలు చేయమని అడిగే నైతిక హక్కు తెరాస నేతలకు లేదని అసమ్మతి నేత దిలీప్‌కుమార్ అన్నారు. తాము మహాకూటమి అభ్యర్థులుగా గెలిచామని, పార్టీ గుర్తుపైనే కాదని అన్నా. తాను లేవనెత్తిన అంశాలను రాష్ట్ర కమిటీలో చర్చించాలని డిమాండ్ చేశారు. తాము నోరు విప్పితే తెరాస నేతలపై ప్రజలు రాళ్లు వేస్తారని తెలంగాణా వాది ప్రకాష్ అన్నారు.












Click it and Unblock the Notifications