నేనేమీ ఫీల్ కావడం లేదు: జానా

Jana Reddy
హైదరాబాద్: మంత్రి పదవి రానందుకు తానేమీ బాధ పడడం లేదని మాజీ హోం మంత్రి, నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ శాసనసభ్యుడు కె.జానా రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి మంత్రి వర్గంలో చోటు దక్కడం లేదనే నేపథ్యంలో ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి తన జట్టును ఎంపిక చేసుకుంటారని, ముఖ్యమంత్రి తన అభీష్టం మేరకు మంత్రులను ఎంపిక చేసుకుంటారని ఆయన అన్నారు. తన పరిధిలో ఏయే ఉద్దేశాలతో చేసినా కాంగ్రెసు పార్టీ మేలు కోసమే ముఖ్యమంత్రి చేశారని అనుకుంటామని ఆయన అన్నారు. ముఠాలు, వర్గాలు కాంగ్రెసు పార్టీలో లేవని ఆయన అన్నారు. తనకు భవిష్యత్తు ప్రణాళిక ఏమీ లేదని ఆయన చెప్పారు.

శాసనసభ్యుడిగా ముఖ్యమంత్రికి తన వంత సహకారం అందిస్తానని ఆయన చెప్పారు. టీవీ వార్తలను బట్టి, ఊహాగానాలను బట్టి తాను స్పందించాల్సిన అవసరం లేదని అంటూనే ఆయన మీడియా ప్రతినిధులు వేసిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. తాను హోంమంత్రిగా సమర్థంగా పని చేశానని, అవినీతికీ అక్రమాలకూ తావు ఇవ్వలేదని, అప్పుడప్పుడు అభిప్రాయభేదాలు రావచ్చునే గానీ వ్యతిరేకత వ్యక్తం చేయలేదని ఆయన అన్నారు. తెలంగాణపై అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని ఆయన చెప్పారు. ప్రజల మెప్పు పొందడమే ప్రభుత్వ లక్ష్యంగా ఉంటుందని భావిస్తున్నట్లు చెప్పారు. ఏది చేసినా ప్రజలకు మేలు చేయడానికే కాంగ్రెసు ప్రయత్నిస్తుందని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+