హైదరాబాద్: ఈ సారి మహానాడుకు సినీ నటుడు బాలకృష్ణ ప్రత్యేక ఆకర్షణ కానున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా ఈ మహానాడుకు హాజరయ్యే అవకాశం ఉంది. ఇక మహానాడు విశేషాలను ఎర్రంనాయుడు మీడియా ముందుంచారు. ఆయన మాట్లాడుతూ..ప్రజా సమస్యలే ప్రధాన అజెండా ఈసారి మహానాడు నిర్వహిస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ ప్రకటించిందన్నారు. పేదరిక నిర్మూలన, చేతివృత్తులకు ప్రోత్సాహం, తాగునీరు, వ్యవసాయం, నిత్యావసరాల ధరలు వంటి అంశాలపై తీర్మానాలతోపాటు ఎన్నికల ఫలితాలు, పార్టీ సంస్థాగత నిర్మాణంపై విస్తృతమైన చర్చలుంటాయని తెదేపా సీనియర్ నేత ఎర్రంనాయుడు అన్నారు. సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో రేపటి నుంచి రెండురోజులు పాటు మహానాడు జరగటానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.