హైదరాబాద్: లోక్ సత్తా మూడు రోజుల మేధో మధన సదస్సులో పార్టీ కార్యాచరణ సిద్ధం చేసి వచ్చే నెల నుంచి అమలు చేస్తామని ఆ పార్టీ అధ్యక్షులు జయప్రకాష్ నారాయణ అన్నారు. మిగతా పార్టీలకు భిన్నంగా విదేశీ నిపుణుల సలహాలను స్వీకరిస్తామని ఆయన తెలిపారు. ప్రధానంగా ప్రజలను కొత్త రాజకీయంవైపు మళ్లించడం వనరుల సమీకరణ తదితర అంశాలపై చర్చిస్తున్నట్లు ఆయన తెలిపారు.