హైదరాబాద్: మంత్రిత్వ శాఖల కేటాయింపులో తెలంగాణకు అన్యాయం జరిగిందని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. అన్ని అప్రధానమైన శాఖలు కేటాయించారని ఆయన మండిపడ్డారు. తెలంగాణకు హోంమినిస్టర్ పదవిచ్చినా అది కోరల్లేని పామువంటిదని ఎద్దేవ చేశారు. పొన్నాల లక్ష్మయ్యకు ప్రధానమైన భారీ నీటిపారుదల శాఖను కేటాయించిన విషయాన్ని ఆయన దాటవేశారు.