హైదరాబాద్: ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి మంగళవారం రాత్రి జెరూసెలేం వెళుతున్నారు. ఆయన ఈ సాయంత్రమే వెళ్లాల్సి ఉంది. అయితే ఆయన పర్యటన రాత్రికి వాయిదా పడింది. సోమవారం మంత్రి వర్గ విస్తరణను పూర్తి చేసిన ఆయన మంగళవారం ఉదయం మంత్రులకు శాఖలను కేటాయించారు. అనంతరం తన క్యాంపు కార్యాలయంలో మంత్రులతో సమావేశమయ్యారు.
ఆ తర్వాత ఆయన ఢిల్లీ వెళ్తారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఆయన జెరూసలేంకు కుటుంబ సమేతంగా బయలు దేరి వెళ్తారు. ఈ నెల 30వ తేదీన ఆయన హైదరాబాదు తిరిగి వస్తారు. ఆయన వెంట ఇద్దరు అధికారులు కూడా ఉంటారు.