రవాణా శాఖపై శత్రుచర్ల అసంతృప్తి
హైదరాబాద్: తనకు కేటాయించిన రవాణా శాఖపై మంత్రి శత్రుచర్ల విజయరామరాజు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తనకు ఇష్టంలేని శాఖను కేటాయించడం పట్ల బాధ్యతలు స్వీకరించడానికి ఆయన నిరాకరిస్తున్నారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు ఆయన ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డిని కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు.
రవాణా శాఖను కేటాయించగానే సంబంధిత శాఖకు చెందిన అధికారులు అభినందించేందుకు వచ్చారు. అయితే వారి అభినందనలను స్వీకరించేందుకు శత్రుచర్ల విజయరామరాజు నిరాకరించారు. తాను రవాణా శాఖను స్వీకరించడానికి సిద్ధంగా లేనని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రికి తెలియజేస్తానని చెప్పి ఆయన అధికారులను వెనక్కి పంపించారు.












Click it and Unblock the Notifications