టెన్త్ ఫలితాలు: నిజామాబాద్ ఫస్ట్

హైదరాబాద్: ఎస్ ఎస్సీ పరీక్షా ఫలితాలను ప్రాథమిక విద్యా మంత్రి మాణిక్య వరప్రసాద్ బుధవారం విడుదల చేశారు. ఈ పదో తరగతి పరీక్షా ఫలితాల్లో నిజామాబాద్ జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. ఈ జిల్లాలో 78.83 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. చిట్టచివరి స్థానంలో చిత్తూరు జిల్లా నిలిచింది. ఈ జిల్లాలో 66.93 శాతం మంది మాత్రమే పాసయ్యారు. ఈసారి కూడా బాలికలదే పైచేయి అయింది. బాలికలు 79.09 శాతం మంది ఉత్తీర్ణులు కాగా బాలురు 90.94 శాతం మంది పాసయ్యారు.

ఈసారి 78.83 శాతం మంది విద్యార్థినీవిద్యార్థులు పాసయ్యారు. ఈ ఏడాది నిరుటి కన్నా 3.36 శాతం మంది ఎక్కువ పాసయ్యారు. మొత్తం 10 లక్షల 1 వేయి 529 మంది పరీక్ష రాయగా 7 లక్షల 89 వేల 468 మంది పాసయ్యారు. ప్రథమశ్రేణిలో 5 లక్షల 43 వేల 327 మంది పాసయ్యారు. ద్వితీయ శ్రేణిలో లక్షా 73 వేల 104 మంది, తృతీయ శ్రేణిలో 73 వేల 27 మంది ఉత్తీర్ణులయ్యారు.

జిల్లాల వారీగా గుంటూరులో 86.30, కృష్ణాలో 85.69, పశ్చిమ గోదావరిలో 85.28, మహబూబ్ నగర్ లో 85.27, కరీంనగర్ లో 87.22, కడపలో 84.03, మెదక్ లో 81.75, ఖమ్మంలో 81.32, తూర్పు గోదావరిలో 80.82, విశాఖపట్నంలో 80.56, ప్రకాశంలో 80.03, నల్లగొండలో 79.64, ఆదిలాబాద్ లో 77.74, నెల్లూరులో 77.66, శ్రీకాకుళంలో 77.13, విజయనగరంలో 76.76, రంగారెడ్డిలో 73.69, అనంతపురంలో 71.70, వరంగల్ లో 71.51, హైదరాబాదులో 70.37, కర్నూలులో 70.25 శాతం మంది పాసయ్యారు.

ఈ కింది సైట్లలో టెన్త్ క్లాస్ ఫలితాలు చూసుకోవచ్చు.

www.manabadi.com
www.indiaresults.com
www.examresults.net
www.schools9.com
www.netlinxresults.net
www.winentrance.com/results/andhra_pradesh/ssc/
www.examresults.aponline.gov.in

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+