ఇక ఏటా డీఎస్సీ: విద్యామంత్రి
హైదరాబాదు: డీఎస్సీకి అర్హులైన అభ్యర్ధులకు ప్రాథమిక విద్యాశాఖ మంత్రి మాణిక్య వరప్రసాద్ శుభవార్త చెప్పారు. ఇక నుంచి ప్రతీ ఏటా డీఎస్సీ నిర్వహిస్తామని ప్రకటించారు. ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మంత్రి వెల్లడించారు. రేపు జరిగే డిఎస్సీకి అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని మంత్రి తెలిపారు. టీచర్ల సంఘాలతోచర్చించి బదిలీలపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. గుర్తింపులేని స్కూళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని, అధిక ఫీజులు వసూలు చేస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.












Click it and Unblock the Notifications