ఐశ్వర్యకు షారూఖ్ క్షమాపణ

అభిషేక్, ఐశ్వర్యలను షారూక్ భార్య గౌరి తన ఇంటికి ఆహ్వానించారు. దాంతో వారు షారూక్ ఇంటికి చేరుకున్నారు. రితిక్ - సుషేన్ రోషన్, కరీనా కపూర్ - సైఫ్ అలీ ఖాన్, కజాల్ ఆనంద్ - అర్జున్ రాంపాల్ తదితర జంటలు కూడా షారూక్ ఇంటికి వెళ్లి మర్నాడు ఉదయం ఆరు గంటల వరకు అక్కడే ఉన్నారు. షారూక్ ఖాన్ నిర్మించిన చల్తే చల్తే సినిమా నుంచి ఐశ్వర్యా రాయ్ తప్పించడంతో ఇరు కుటుంబాల మధ్య గొడవలు ప్రారంభమైంది. తమ పెళ్లికి కూడా అభిషేక్, ఐశ్వర్య షారూక్ దంపతులను ఆహ్వానించలేదు. షారూక్ ఐశ్వర్యపై ఏదో వ్యాఖ్య చేశాడని సల్మాన్ చెప్పడం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. దీనిపై తాను ఆ విధంగా ఐశ్వర్యను అనలేదని షారూక్ ఎస్పీ నేత అమర్ సింగ్ ను కలిసి వివరణ కూడా ఇచ్చుకున్నాడు. కానీ ఇరు కుటుంబాల మధ్య సయోధ్య సాధ్యం కాలేదు.












Click it and Unblock the Notifications