వికలాంగుల పోస్టుల భర్తీ: సురేఖ
హైదరాబాద్: ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న వికలాంగుల పోస్టులను వెంటనే భర్తీ చేస్తామని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. సచివాలయంలోని డి బ్లాకులో ఆమె శనివారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతలు తరలివచ్చి ఆమెను అభినందించారు.
రాష్ట్రంలో 7 కొత్త బీసీ స్టడీ సర్కిళ్లు
రాష్ట్రంలోని 7 ప్రాంతాల్లో కొత్త బీసీ స్టడీ సర్కిళ్లు ఏర్పాటుచేయనున్నారు. ఇందుకు సంబంధించిన ఫైలుపై మంత్రి ముఖేష్ గౌడ్ తొలి సంతకం చేశారు. సచివాలయంలోని ఎ బ్లాక్ లో ఆయన శనివారం బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించి మొదటి ఫైలుపై సంతకం చేశారు. బీసీ స్టడీ సర్కిళ్లను ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, తిరుపతి, కడప, విజయనగరం జిల్లాల్లో ఏర్పాటు చేస్తామన్నారు. బీసీ విద్యార్థులకు సకాలంలో స్కాలర్‌షిప్‌లు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు.












Click it and Unblock the Notifications