తెరాస విఫలమైంది:దిలీప్ కుమార్
హైదరాబాద్: కేసీఆర్ పై మరోమారు తెలంగాణ విమోచన సమితి ప్రతినిధి కె. దిలీప్‌కుమార్ విరుచుకుపడ్డారు. ప్రత్యేక తెలంగాణ సాధించడంలో తెలంగాణ రాష్ట్ర సమితి విఫలమైందని ఆయన విమర్శనాస్త్రాలు సంధించారు. మాటిమాటికీ కేసీఆర్ చేసిన రాజీనామా ప్రయోగాన్ని ప్రజలు తిరస్కరించారని ఆయన అన్నారు. దేశంలోని తోంభై శాతం రాజకీయ పార్టీలు తెలంగాణకు అనుకూలంగా ఉన్నా రాష్ట్రం ఏర్పాటు కాకపోవడానికి ఉద్యమంలో లోపాలే కారణమన్నారు. తెలంగాణ విమోచన సమితి పేరుతో ఏర్పాటు కానున్న ఈ వేదిక ద్వారా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని తీవ్రం చేస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications