ఒంటరి పోరు కి రెడీ :దానం
హైదరబాదు : రానున్న స్థానిక ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ పార్టీ ఎవరితోనూ పొత్తులు పెట్టుకోదని సొంతంగానే పోటీ చేస్తుందని ఆరోగ్య శాఖ మంత్రి దానం నాగేందర్ తెలిపారు. గ్రేటర్ హైదరాబాదు ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగనున్నట్లు ఆయన స్పష్టం చేసారు. ఈరోజు అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనానికి వెళ్లిన ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకాన్ని కొనసాగించేందుకు కేంద్రం నుంచి మరిన్ని నిధులు తీసుకు రానున్నట్లు ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications