సోనియాతో మీరా అందుకే
న్యూఢిల్లీ : సోనియా గాంధీతో కేంద్రమంత్రి మీరా కుమార్ సమావేశమయ్యారు. లోకసభ సభాపతిగా ఆమె పేరును ప్రకటించే అవకాశముండటంతో ఆమె పార్టీ నేతతో చర్చలు జరిపినట్టు సమాచారం. అనూహ్యంగా లోకసభ స్పీకర్ పదవి రేసులోకి వచ్చిన మీరాకుమార్ సోనియాను కలవటం కోసం కాంగ్రేస్ వర్గాల్లో చర్చగా మారింది. స్పీకర్ పదవి కోసం మీరాకుమార్ పేరును సాయంత్రం వరకు ప్రకటించే అవకాశం ఉంది. స్పీకర్ పదవికి పేరు ప్రకటించిన అనంతరం మీరా కుమార్ మంత్రి పదవికి రాజీనామా చేసే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications