నేడే ఎంసెట్ ఫలితాలు
హైదరాబాద్: ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఎంసెట్-2009) ఫలితాలు నేడు సోమవారం సాయం త్రం 6 గంటలకు విడుదల కానున్నాయి. రాష్ట్ర సాంకే తిక విద్యా శాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణ ఈ ఫలితాలను విడుదల చేస్తారు. www.andhrajyothy.com, www.apeacet.org, www.results.educationandhra.com వెబ్ సైట్లలో ఫలితాలు అందుబాటులో ఉంటాయి. ఎంసెట్ లో ఇంటర్ మా ర్కులకు వెయిటేజీ ఇస్తున్న కారణంగా ప్రస్తుతం ఎంసెట్లో అభ్యర్థులు పొందిన మార్కులను మాత్రమే ప్రకటిస్తారు.
ఇంటర్ అడ్వాన్డ్స్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు కూడా వెల్లడైన తర్వాత ఎంసెట్ ర్యాంకులను ప్రకటిస్తారు. 57333, 54242, 54545, 55555 నెంబర్లకు ఎస్ ఎమ్ ఎస్ చేసి మార్కులు తెలుసుకోవచ్చు. ఎయిర్ టెల్, ఎయిర్ సెల్, వొడాఫోన్, ఐడియా, బీఎస్ ఎన్ ఎల్, టాటా, రిలయన్స్ మొబైల్ నెంబర్లైన 5054242, 5052828, 1255510, 1255514, 1255524, 1255564, 540406కు ఫోన్ చేసి, ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్(ఐవీఆర్ ఎస్) ద్వారా మార్కులు తెలుసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బీఎస్ ఎన్ ఎల్, సెల్ వన్ నెంబర్లయిన 1255560, 12630099 ద్వారా నేరు గా మార్కులు తెలుసుకునే అవకాశమూ కల్పిస్తున్నారు.